స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగులో

ఆంగ్లభాష యొక్క ఆవశ్యకత ప్రతి వ్యక్తికీ నిజ జీవితంలో భాగం అయింది. ప్రస్తుతం దీని అవసరం అన్ని వ్యవస్థలలో అత్యవసరం అయింది. ఆంగ్లభాషను సులభంగా నేర్చుకోవటానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది.

ఈ Spoken English కోర్సు 25 విభాగాలుగా విభజించబడింది. ఆంగ్లభాష పై చక్కని పట్టును సాధించటానికి ఈ కోర్సులోని ప్రతీ విభాగం పై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

Important Small Words

(ముఖ్యమైన చిన్న పదాలు) Spoken English In Telugu (Lesson-1)

Important Small Words:

ఏ భాషలో నైనా తరుచుగా వాడే ముఖ్యమైన చిన్న పదాలు ఉంటాయి. వాటిపై సంపూర్ణ అవగాహన సాధించడం ద్వారా భాషను సులభంగా నేర్చుకోవొచ్చు. క్రింద ఇవ్వబడిన పదాలన్ని ప్రాథమిక స్థాయి పరిజ్ఞానం ఉన్నవారికి కూడా తెలిసినప్పటికీ వీటిని ఎందుకు ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే ఈ పదాలు చాల ముఖ్యమైనవి, కనుక వీటిని ఒకసారి క్షున్నంగా పరిశీలించండి.

Pronouns, Adjectives, Prepositions, Adverbs, Conjunction అంటే ఏమిటో Lesson-2 (Parts of Speech) లో ఇవ్వబడింది, ముందుగా క్రింద ఇవ్వబడిన పదాలను మరియు వాటి అర్థాలను ఒక్కసారి గమనించండి.

I - నేను
my - నా, నాయొక్క
me - నన్ను, నాకు
we - మేము, మనము
our - మన, మన యొక్క, మా, మాయొక్క
us - మనకు, మాకు, మనల్ని, మమ్మల్ని
you - నీవు, మీరు
your - నీ, నీ యొక్క, మీ, మీ యొక్క
they - వారు
their - వారి, వారి యొక్క
them - వారికి, వారిని
she - ఆమె
her - ఆమెకు, ఆమెను, ఆమె యొక్క
he - అతడు, వాడు
his - అతని, అతని యొక్క, వాని, వానియొక్క
him - అతనిని, అతనికి, వానిని, వానికి
it - ఇది
its - దీని యొక్క
this - ఇది, ఈ
that - అది, ఆ
these - ఇవి, ఈ
those - అవి, ఆ

Prepositions, Conjunctions, Adverbs:

for - కొరకు, కోసం
to - కు, కి
from - నుండి
since - నుండి
of - యొక్క
about - గూర్చి, గురించి
with - తో
at - వద్ద, దగ్గర
by - వలన, ద్వారా
through - వలన, ద్వారా
near - దగ్గర, వద్ద, సమీపంలో
in - లో, లోపల
on - మీద, పైన
under - క్రింద
below - లోపల, దిగువన
above - పైన
bottom - అడుగున
if - అయితే
but - కానీ
or - కానీ, లేదా
so - అలా, కనుక, కాబట్టి
hence - కనుక, కాబట్టి
and - మరియు
because - ఎందుకంటే, ఎందుకనగా
due to - ఆ కారణంగా
although - అయినప్పటికీ

what - ఏమిటి
why - ఎందుకు
when - ఎప్పుడు
where - ఎక్కడ
which - ఏది
how - ఎలా
howmany - ఎన్ని, ఎంతమంది,
howmuch - ఎంత
who - ఎవరు
whose - ఎవరి, ఎవరి యొక్క
whom - ఎవరిని, ఏవరికి

Parts of Speech

(భాషా భాగాలు) Spoken English In Telugu (Lesson-2) Parts of Speech:

ఆంగ్లభాషలోని పదాలు అవి చేసే పనులను బట్టి 8 రకాలుగా విభజించారు. వాటినే Parts of Speech (భాషా భాగాలు) అని అంటారు.
అవి :

1.Noun - (నామ వాచకము)
2.Pronoun - (సర్వ నామము)
3.Verb - (క్రియ)
4.Adjective - (విశేషణము)
5.Adverb - (క్రియా విశేషణము)
6.Preposition - (విభక్తి ప్రత్యయము)
7.Conjunction - (సముచ్ఛయము)
8.Interjection - (ఆశ్చర్యార్థకము)

Noun అనునది ఒక పదము. ఇది మనుషుల, వస్తువుల, ప్రదేశాల, పక్షుల మరియు జంతువుల పేర్లను తెలియజేస్తుంది.

Eg:
1. Chiranjivi is a M.P.
2. He likes to travel by Aeroplane.
3. The Parrot is a beautiful bird.

Pronoun అనునది ఒక పదము. ఇది నామవాచకానికి బదులుగా ఉపయోగించబడుతుంది. (లేదా) noun బదులుగా ఉపయోగించే పదాన్ని Pronoun అని అంటారు.

Eg:
1. It is my dog.
2. He is my friend.
3. I am a teacher.

Verb అనునది ఒక పదము. ఇది కర్త చేసే పనిని తెలియజేస్తుంది. ఇలా కర్త చేసే పనిని తెలియజేసే పదాన్ని verb అని అంటారు.

Eg:
1. He is watching T.V.
2. I am drinking water.
3. They went to himalayas last year.

Adjective అనునది ఒక పదము. ఇది ఒక వ్యక్తి లేదా వొస్తువు యొక్క గుణగణాలను తెలియాజేస్తుంది. (లేదా) నామవాచకము యొక్క గుణమును, సంఖ్యను, మరియు రంగును తెలియజేసే దానిని Adjective (విశేషణము) అని అంటారు.

Eg:
1. I met an awesome guy yesterday.
2. She has beautiful eyes
3. We have a pink car.

Adverb అనునది ఒక పదము. ఇది క్రియ గురించి మరింత వివరించి తెలియజేస్తుంది. Verb యొక్క / Adjective యొక్క గాని అర్థాన్ని వివరించే లేదా విశ్లేషించే పదాన్ని (Adverb) క్రియావిశేషణము అని అంటారు.

Eg:
1. Ramesh speeks nicely.
2. Raju is a good boy.
3. She writes very slowly.
Preposition :

Preposition అనునది ఒక పదము. ఇది Noun / Pronoun ముందు ఉపయోగించబడుతుంది. Pre అంటే "ముందు" Position అంటే "స్థానము" కాబట్టి ఇది noun కు లేదా pronoun కు ముందు ఉండి వాటికి గల స్థానాన్ని లేదా సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది.

Eg:
1. They come to college by bus.
2. Rashmika is looking at me.
3. My laptop is on the table.
Conjunction :

Conjunction అనునది ఒక పదము. ఇది ఒక పదాన్ని మరొక పదంతో కానీ ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో కానీ కలుపుతుంది.

Eg:
1.Raju and raghu are busy.
2. I will take either coffee or tea
3. I requested my boss but he did not give leave.

Interjection :

Interjection అనునది ఒక పదము. ఇది అనుకోకుండా లేదా హఠాత్తుగా కలిగే ఫీలింగును తెలియజేస్తుంది. (లేదా) ఎక్కువ సంతోషం గాని, ఎక్కువ బాధ గాని, భయం గాని, కలిగినప్పుడు హఠాత్తుగా వొచ్చే భావాలను Interjection (ఆశ్చర్యార్ధకం) తెలియజేస్తుంది.

Eg:
1. Oh!
2. Ah!
3. Wow! etc..

Articles

(ఆర్టికల్స్) Spoken English In Telugu (Lesson-3)

A, An, The లను Articles అని అంటారు.

A లేదా An అంటే "ఒక" అని అర్థం, The అంటే "ఆ" అని అర్థం.

A మరియు An లను "Indefinite Articles" అని పిలుస్తారు, మరియు The ను "Definite Article" అని పిలుస్తారు.

A మరియు An లను Singular Words (ఏకవచనాలు) ముందే ఉపయోగించాలి.

A అనే Article ను ఎల్లప్పుడూ Consonant Sound (హల్లు శబ్దం) గల Singular Words (ఏకవచనాలు) ముందే ఉపయోగించాలి, An అనే Article ను ఎల్లప్పుడూ Vowel Sound (అచ్చు శబ్దం) గల Singular Words (ఏకవచనాలు) ముందే ఉపయోగించాలి.

The ను ప్రత్యేకమైన వ్యక్తి లేదా వస్తువు గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. The ను Vowel Sound, Consonant Sound ఉన్నా/లేకున్నా ఉపయోగిస్తారు, అలాగే The ను మనం Singular, Plural పదాల ముందు ఉపయోగించవచ్చు.

A మరియు An ను Indefinite Articles అని పిలుస్తారు. ఎందుకనగా A మరియు An ఖచ్చితమైన వ్యక్తిని/వస్తువుని సూచించదు కాబట్టి.

1. He met a scientist yesterday.
2. She met an engineer yesterday.

పైన ఉన్న మొదటి వాక్యంలో Scientist ను అతడు కలిశాడు అని ఉంది, కానీ ఏ రంగానికి సంబందించిన Scientist ను అతడు కలిశాడో లేదు. అలాగే రెండవ వాక్యంలో ఆమె ఒక Engineer ను కలిసింది అని ఉంది, కానీ ఏ Engineer ని కలిసిందో లేదు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో Indefinite Articles అయిన A, An లను ఉపయోగించాలి.

Indefinite Article A హల్లు శబ్దం (Consonant Sound) గల ఏకవచన (Singular) పదాల ముందు ఉపయోగించబడుతుంది.

Eg: a book, a teacher, a cat, a computer etc..

Indefinite Article An అచ్చు శబ్దం (Vowel Sound) గల ఏకవచన (Singular) పదాల ముందు ఉపయోగించబడుతుంది.

Eg: an umbrella, an officer, an idiot, an indian etc..

The ను Definite Article అని అంటారు. ఎందుకంటే అది ఖచ్చితమైన వ్యక్తిని/వస్తువుని సూచిస్తుంది కాబట్టి.

He met the science teacher yesterday.
She met The computer science engineer yesterday.

The అనే Article ఏకవచన, బహువచన పదాల ముందు ఉపయోగించబడుతుంది. అలాగే దీనికి శబ్దంతో పని లేదు.

Eg: The musi river, The sahara desert, The golconda fort etc..

కొన్ని సందర్భాలలో ఏ Article ని కూడా ఉపయోగించకూడదు. అవి: భాషల పేర్లముందు, నెలల పేర్లముందు, వారల పేర్లముందు, ఆటల పేర్లముందు, వ్యక్తుల పేర్లముందు, పట్టణాల పేర్లముందు, దేశాల పేర్లముందు, వాహనాల పేర్లముందు, భోజనాల పేర్లముందు, వ్యాధుల పేర్లముందు, బంధుత్వాల పేర్లముందు, కాలాల పేర్లముందు, లెక్కించలేనివాటి పేర్లముందు.